నిజ నిర్ధారణ: జగన్ తన గొంతు పట్టుకుని గోడకు గుద్దాడు అని షర్మిల వ్యాఖ్యానించినట్లు 'Way2News' కథనాన్ని ప్రచురించిందా?

నిజ నిర్ధారణ: జగన్ తన గొంతు పట్టుకుని గోడకు గుద్దాడు అని షర్మిల వ్యాఖ్యానించినట్లు 'Way2News' కథనాన్ని ప్రచురించిందా?

ఆస్తిలో వాటా అడిగినందుకు జగన్ గొంతు పట్టుకుని గోడకు గుద్దాడు అని .. వ్యాఖ్యానించినట్లు చెబుతూ ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది.
Published on

ఇటీవల విజయవాడలో జరిగిన ఏపీసీసీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌పైనా విమర్శలు కురిపించారు.

సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. 2019 తర్వాత తాడేపల్లిలోని జగన్ ఇంటికి ఒక్కసారి మాత్రమే వెళ్లి ఆస్తిలో వాటా అడిగినందుకు జగన్ గొంతు పట్టుకుని గోడకు కొట్టారని.. దానికి సాక్ష్యం తన తల్లి విజయమ్మే” అని వ్యాఖ్యానించినట్లు చెబుతూ ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనం సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది.

నిజ నిర్ధారణ :

సౌత్ చెక్ ఈ పోస్ట్‌ని సవరించినదిగా గుర్తించింది మరియు ఇది పూర్తిగా తప్పు.ఈ ఫోటో మార్చి 2023 లో 'Way2News' ప్రచురించిన వార్తా కథనం నుండి సవరించబడింది.

వైరల్ పోస్ట్‌లో షేర్ చేసిన వార్తా కథనం యొక్క ఆర్టికల్ లింక్ ద్వారా మేము 'Way2News'లో శోధించాము. "GK - ప్రముఖ వ్యక్తుల బిరుదులు" అనే టైటిల్ తో ఈ సంస్థ 21 మార్చి 2023 న ప్రచురించిన అసలైన వార్తలను మేము కనుగొన్నాము. అందువల్ల అసలు కథనాన్ని సవరించి, ఫోటోను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు రుజువైంది.

మేము మరింత శోధించినప్పుడు, వైరల్ పోస్ట్‌లో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇతర ఏజెన్సీలు నివేదించినట్లు మాకు కనుగొనబడలేదు.

వైఎస్ షర్మిల జగన్‌పై ఇంత తీవ్ర విమర్శలు చేసి ఉంటే, చాలా వార్తా సంస్థలు ఈ విషయాన్ని నివేదించి ఉండేవి.అయితే "Way2News" మాత్రమే దానిపై కథనాన్ని కలిగి ఉంది.

అందుకని, జగన్ తన గొంతు పట్టుకుని గోడకు కొట్టారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించినట్లు 'Way2News' కథనాన్ని ప్రచురించలేదు. ఈ ఫోటో ఎడిట్ చేయబడినది.

logo
South Check
southcheck.in