Fact Check : కడపలో చైన్ దొంగతనం చేస్తూ దొరికిన YSRCP సోషల్ మీడియా సభ్యులు అహ్మద్, ప్రణీత్ రెడ్డి అంటూ వచ్చిన దావా అవాస్తవం

నిజానికి ఈ వైరల్ వీడియో 2019లో ఢిల్లీలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ.
Fact Check : కడపలో చైన్ దొంగతనం చేస్తూ దొరికిన YSRCP సోషల్ మీడియా సభ్యులు అహ్మద్, ప్రణీత్ రెడ్డి అంటూ వచ్చిన దావా అవాస్తవం

ఇద్దరు మహిళలు రిక్షా దిగి రోడ్డు దాటుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, మహిళల మెడ నుండి చైన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, YSRCP సోషల్ మీడియా సభ్యులు అనే వాదనతో కొంతమంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

"కడప లో చైన్ దొంగతనం చేస్తూ దొరికిన వైస్సార్సీపీ సోషల్ మీడియా అహ్మద్, ప్రణీత్ రెడ్డి దేహశుద్ధి చూసిన కడప ప్రజలు" అంటూ ఒక X వినియోగదారు ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు YSRCP సోషల్ మీడియా సభ్యులు కాదని ఈ దావా తప్పు అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వీడియో యొక్క గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినపుడు, యూట్యూబ్‌లో ఒక వీడియోను మరియు ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వార్తా నివేదికలను కనుగొన్నాము.

'పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌లోని ఓ రోడ్డులోని ఓ సీసీటీవీ క్లిప్‌లో ఆ మహిళ తన కూతురితో కలిసి రోడ్డు దాటుతుండగా వచ్చిన బైక్‌దారులు అకస్మాత్తుగా ఆమె నెక్లెస్‌ను లాక్కెళ్లినట్లు కనిపించింది. తల్లీకూతుళ్లు వెంటనే స్నాచర్‌ను పట్టుకుని బైక్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోయే వరకు వదిలిపెట్టలేదు. వారిలో ఒకరు తప్పించుకోగలిగారు.

తల్లీకూతుళ్లు, పట్టుబడిన వ్యక్తిని కొడుతుండగా,చుట్టుపక్కల ప్రజలు ఒక గుంపు గుమిగూడి అతనిని కొట్టడం ప్రారంభించారంటూ' NDTV వార్తా కథనాన్ని నివేదించింది.

ఆగస్ట్ 30న ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో బైక్‌పై చైన్ స్నాచర్లను ఒక మహిళ మరియు ఆమె కుమార్తె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత ఆ చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారంటూ ANI 2019 సెప్టెంబర్ 3న, X లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

కావున, నిజానికి ఈ ఘటన 2019లో ఢిల్లీలో జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కాదు.

కాబట్టి వీడియోలోని చైన్ స్నాచర్లు YSRCP సోషల్ మీడియా సభ్యులు అని ఈ సంఘటన కడపలో జరిగింది అనే వాదన అవాస్తవమని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in