Hyderabad: రేపటి నుండి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమల్లోకి రాబోతున్నాయంటూ క్లెయిమ్ చేస్తున్న ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంపై తెలంగాణ పోలీస్ లోగో, కమీషనర్ సజ్జనార్ ఫోటో కూడా ఉన్నాయి. అన్ని కాల్స్ రికార్డు చేయబడి, సేవ్ చేయబడతాయని, ప్రభుత్వానికి లేదా పాలకులకు వ్యతిరేకంగా సందేశాలు, వీడియోలు పంపవద్దని ఈ చిత్రంలో రాశారు.
"రాజకీయ లేదా మతపరమైన అంశంపై సందేశాలు రాయడం లేదా పంపడం నేరం... అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్టు కావచ్చు... పోలీసులు నోటీసు జారీ చేస్తారు... ఆ తర్వాత సైబర్ క్రైమ్ చర్య తీసుకుంటారు, ఇది చాలా తీవ్రమైనది" అంటూ మొత్తం 20 పాయింట్లు ఉన్న సందేశాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.
ఈ చిత్రం వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. చాల గ్రూపులతో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న చిత్రంలోని గమనికలో ఎటువంటి నిజంలేదు.
వాట్సాప్, ఫోన్ కాల్స్ కు సంబంధించి ఆంక్షలు అమల్లోకి రాబోతున్నట్లు చూపిస్తున్న వార్త కథనాలు, సోషల్ మీడియా పోస్టులు దొరకలేదు.
వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, యాప్‌లో పంపబడిన అన్ని సందేశాలు మరియు మీడియా ఎండ్-టు-ఎండ్-ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయి. సంభాషణలో ఉన్న వ్యక్తి, రిసీవర్ తప్ప మరెవరూ, వాట్సాప్ కూడా వాటిని చూడడం సాధ్యం కాదు.
"మీరు వాట్సాప్ మెసెంజర్‌ని ఉపయోగించి మరొక వ్యక్తితో చాట్ చేసినప్పుడు వాట్సాప్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉపయోగించబడుతుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మీ వ్యక్తిగత సందేశాలు మరియు కాల్‌లను మీకు మరియు మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి మధ్య ఉంచుతుంది. చాట్ వెలుపల ఎవరూ, వాట్సాప్ కూడా వాటిని చదవలేరు, వినలేరు లేదా షేర్ చేయలేరు" అని రాశారు.
వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పుడు సమాచారం అని. పోలీసులు ఈ సమాచారాన్ని జారీ చేయలేదు హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ చిత్రంపై సోషల్ మీడియాలో స్పందించారు.
కాబట్టి వైరల్ అవుతున్న చిత్రంలో ఉన్న గమనికలలో నిజం లేదని, దాన్ని పోలీసులు జారీ చేయలేదని తేలింది. సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.