Telugu

Fact Check: సీఎం అయ్యాక సినీ పెద్దలు విష్ కూడా చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి...

ముఖ్య మంత్రితో సినీ ప్రముఖుల భేటీ అనంతరం "ఏడాది కాలంగా తనతో సినీ పెద్దలు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి" అని ఆరోపిస్తున్న న్యూస్ కార్డు వైరల్ అవుతోంది.

Sherly

Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 26న తెలుగు సినీ ప్రముఖుల ప్రతినిధి బృందాన్ని కలిశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య విభేదాలు తలెత్తాయనే ఊహాగానాల మధ్య ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో సీఎం ఎవరో కూడా మీకు తెలియదు, సీఎం అయ్యాక కూడా వచ్చి విష్ చేయలేదు అని ముఖ్య మంత్రి సినీ ప్రముఖులతో భేటీలో ఆవేదన వ్యక్తం చేసారని ఆరోపిస్తున్న న్యూస్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“మేము అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మీకు సీఎం ఎవరో తెలియట్లేదు. సీఎం అయ్యాక వచ్చి విష్ కూడా చేయలేరు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలుపలేరు. సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభం కాగానే ఏడాది కాలంగా తనతో సినీ పెద్దలు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి,” అని న్యూస్ కార్డులో ఆరోపించారు.

ఈ న్యూస్ కార్డు Way2News ఫార్మాట్‌లో ఉంది, ఒక లింక్ కూడా కనిపిస్తుంది. ఈ న్యూస్ కార్డును ఫేస్‌బుక్ లో షేర్ చేశారు. (ఆర్కైవ్)

Fact Check

ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించాము. న్యూస్ కార్డు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేయబడినwaది.

వైరల్ న్యూస్ కార్డులో ఉన్న లింక్ ద్వారా, Way2News ప్రచురించిన న్యూస్ కార్డు కనిపించింది. ఈ న్యూస్ కార్డు టైటిల్ వైరల్ న్యూస్ కార్డు టైటిల్ ఒకటే, అయితే లోపల ఉన్న సమాచారం వేరే.

"సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు," అని న్యూస్ కార్డు పేర్కొంది.

Way2News Fact Check కూడా ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ Xలో పోస్ట్ చేశారు... ""ఫేక్ న్యూస్ అలర్ట్! కొంతమంది దుర్మార్గులు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది @way2_news కాదు.

అసలు కథనం లింక్ ఇక్కడ ఉంది: http://way2.co/b7gy4w "

వైరల్ న్యూస్ కార్డులో ఉద్దేశపూర్వకంగా అసలైన న్యూస్ కార్డులో ఉన్న సమాచారాన్ని మార్చి వ్రాసినట్లు తేలింది కాబట్టి క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారిస్తున్నాం.

Fact Check: Potholes on Kerala road caught on camera? No, viral image is old

Fact Check: ഇത് റഷ്യയിലുണ്ടായ സുനാമി ദൃശ്യങ്ങളോ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: ஏவுகணை ஏவக்கூடிய ட்ரோன் தயாரித்துள்ள இந்தியா? வைரல் காணொலியின் உண்மை பின்னணி

Fact Check: ರಷ್ಯಾದಲ್ಲಿ ಸುನಾಮಿ ಅಬ್ಬರಕ್ಕೆ ದಡಕ್ಕೆ ಬಂದು ಬಿದ್ದ ಬಿಳಿ ಡಾಲ್ಫಿನ್? ಇಲ್ಲ, ವಿಡಿಯೋ 2023 ರದ್ದು

Fact Check: హైదరాబాద్‌లో ఇంట్లోకి చొరబడి పూజారిపై దాడి? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి