Telugu

Fact Check : టీడీపీ ప్రభుత్వం వీధి వ్యాపారులను బలవంతంగా జేసీబీతో తొలిగిస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ravi chandra badugu

2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారానికి 2015-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని జగన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 2024 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) కార్యాలయాన్ని నీటిపారుదల శాఖకు చెందిన భూమిలో అక్రమంగా నిర్మిస్తున్నందున సీఆర్‌డీఏ అధికారులు పూర్తిగా కూల్చివేశారు.

ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన బిల్డింగ్ ప్లాన్ అనుమతులు లేకుండానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూమిని కేటాయించి అక్రమంగా నిర్మిస్తున్నారు అని టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, చిరు వ్యాపారులకు 10000 రూపాయిలు గత YCP ప్రభుత్వం ఇస్తే , ఇప్పటి TDP ప్రభుత్వం చూడండి బలే సన్మానం చేస్తుంది అంటూ ఓ వీడియో పోస్టులో జేసీబీ ని ఉపయోగించి వీధి వ్యాపారులను బలవంతంగా తొలగిస్తున్న దృశ్యం వైరల్ అవుతూ ఉంది

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు తమిళనాడుకు సంబంధించినది అని సౌత్ చెక్ కనుగొంది

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూన్ 29న, Kavitha Suresh ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో తమిళనాడులోని తాంబరంలో వీధి వ్యాపారుల దుకాణాన్ని తొలగిస్తున్న దృశ్యం షేర్ చేస్తూ "హే, డోన్'ట్ డా ఇంజుస్తిచె...పెట్టమని చెబితే చాలు..దుకాణం కట్టుకుని రోజంతా జీవనోపాధి కోసం రోడ్డుపైనే రోజులు గడుపుతున్న వ్యక్తి...పెంకు పగలగొట్టే ఆ కాంక్రీట్ భవనం ఏది...? అని తమిళ్ లో పేర్కొంది

అంతేకాకుండా, 2024 జూన్ 29న county local newsలో Heartless TN Govt. demolishes street seller’s shop in Tambaram, Tamil Nadu అనే టైటిల్ తో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో హృదయం లేని తమిళనాడు ప్రభుత్వం తాంబరంలో వీధి వ్యాపారుల దుకాణాన్ని బద్దలు కొట్టడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. పేద విక్రేత జీవనోపాధిని నాశనం చేసే చర్య అమానవీయంగా మరియు అన్యాయంగా కనిపిస్తుంది. బాధ్యులైన అధికారులు క్షమాపణలు చెప్పాలని మరియు దుకాణం యజమానికి డబ్బులు చెల్లించాలని, తద్వారా వారు కొత్తగా ప్రారంభించాలని ప్రజలు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కోరుతున్నారు.

వీధి వ్యాపారుల దుకాణాన్ని ధ్వంసం చేయడంలో తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న హృదయపూర్వక చర్యలు బాధ్యుల మానవత్వాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నాయి. ఒక పేద అమ్మకందారుని జీవనోపాధిని ధ్వంసం చేసేంత క్రూరత్వం ఎవరికైనా ఎలా ఉంటుంది? అంటూ ఆ సంఘటన, డాక్టర్ ఎస్‌జి సూర్య Xలో పంచుకున్నారు అని ఆ నివేదిక తెలిపింది

అదనంగా, వైరల్ అవుతున్న వీడియో పోస్ట్ దృశ్యాన్ని మరింత గమనించగా వీధి వ్యాపారుల దుకాణాన్ని జేసీబీ తొలగిస్తున్నపుడు ఆ రోడ్డులో TNSTC బస్సు వెళుతున్న దృశ్యం చూసాము మరియు 2024 జూన్ 29న Telugu Desam Party X ఖాతా ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము అందులో తమిళనాడులో జరిగిన ఘటన తీసుకొచ్చి ఏపీలో జరిగింది అంటూ ఫేక్ చేస్తున్న సజ్జల భార్గవ రెడ్డి.. బెంగళూరు యలహంకా ప్యాలెస్ నుంచి నడుస్తున్న ఎకౌంటు ఇది. జగన్ రెడ్డి దగ్గరుండి ఇలాంటి ఫేక్ చేయిస్తున్నాడు, వేయిస్తున్నాడు అని పేర్కొంది

అందువల్ల, టీడీపీ ప్రభుత్వం వీధి వ్యాపారులను బలవంతంగా జేసీబీతో తొలగిస్తున్న అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Fact Check: Old video of Union minister Jyotiraditya Scindia criticising Bajrang Dal goes viral

Fact Check: ഈസ് ഓഫ് ഡൂയിങ് ബിസിനസില്‍ കേരളത്തിന് ഒന്നാം റാങ്കെന്ന അവകാശവാദം വ്യാജമോ? വിവരാവകാശ രേഖയുടെ വാസ്തവം

Fact Check: திமுக தலைவர் ஸ்டாலினுக்கு பக்கத்தில் மறைந்த முதல்வர் கருணாநிதிக்கு இருக்கை அமைக்கப்பட்டதன் பின்னணி என்ன?

ఫ్యాక్ట్ చెక్: 2018లో రికార్డు చేసిన వీడియోను లెబనాన్‌లో షియా-సున్నీ అల్లర్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు

Fact Check: ಚಲನ್ ನೀಡಿದ್ದಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಪೊಲೀಸರನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಸುಳ್ಳು ಹೇಳಿಕೆ ವೈರಲ್