Hyderabad: "సర్ తన్ సే జుడా" (తల నరికివేత) గురించి నినాదాలు చేసే లేదా మద్దతు ఇచ్చే ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసినట్లుగా క్లెయిమ్ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లో హింసాత్మక పోస్ట్‌ల గురించి కూడా ఈ నెంబర్ ఫిర్యాదు చేయవచ్చని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఫేస్‌బుక్ పోస్టులో ఇలా రాశారు, "NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత ముఖ్యమైన నంబర్లను విడుదల చేసింది!!
ఏవైనా తప్పుడు చర్యలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు (ఉదాహరణకు: ఉగ్రవాద కుట్ర, లవ్ జిహాద్, మజార్ నిర్మాణం, అభ్యంతరకర సోషల్ మీడియా పోస్ట్‌లు మొదలైనవి) గురించి నివేదించడానికి, దయచేసి క్రింది ఏ ఫోన్ నంబర్‌కైనా లేదా ఇ-మెయిల్ ద్వారా వెంటనే తెలియజేయండి.
NIA కంట్రోల్ రూమ్ ఢిల్లీ సంప్రదింపు వివరాలు: * WhatsApp నంబర్: 8585931100 * మొబైల్ నంబర్: 9654447345 * ల్యాండ్‌లైన్ నంబర్: 011-24368800 * ఫ్యాక్స్ నంబర్: 011-24368801 * NIA ఇ-మెయిల్ ID: info.nia@gov.in".
"ముఖ్య గమనిక: "సర్ తన్ సే జుదా" (Sir Tan Se Juda) అనే నినాదం ఇస్తున్నట్లు ఏ ముస్లిం కనిపించినా (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో... ఎక్కడైనా!), వెంటనే దాని స్క్రీన్‌షాట్/ఫోటో తీయండి, లింక్‌ను కాపీ చేయండి మరియు వాట్సాప్ నంబర్‌కు పంపండి లేదా కాల్ చేయండి" అని పేర్కొన్నారు. (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.
ఎన్‌ఐఏ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేసాము. ముస్లింలు చేసే అనుమానాస్పద కార్యకలాపాలను ఫోన్ నంబర్‌ల ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్న పత్రికా ప్రకటనలు ఏవి లేవని కనుగొన్నాం.
పౌరులు 'లవ్ జిహాద్', 'మజార్ నిర్మాణం' లేదా 'సర్ తన్ సే జుడా' పదబంధాన్ని ఎన్‌ఐఏకి ఫిర్యాదుచేయవచ్చని పేర్కొన్న వార్తా నివేదికలు కూడా కీవర్డ్ శోధనలలో కనిపించలేదు.
'కాంటాక్ట్ అస్' విభాగాన్ని తనిఖీ చేసాం. వైరల్ పోస్ట్‌లోని వాట్సాప్ నంబర్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్ ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయాల కాంటాక్ట్ నంబర్‌లు అని కనుగొన్నాం.
జూన్ 23, 2023న పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా Xలో పోస్ట్ చేయబడిన ఒక పోస్ట్ ఫోన్ నంబర్ వాస్తవానికి ఎన్‌ఐఏకు సంబంధించినదే అని పేర్కొంది, కానీ ముస్లింలు చేసే కార్యకలాపాలను నివేదించమని ప్రజలను కోరుతూ సందేశం ఎన్‌ఐఏ జారీ చేయలేదు అని తేలింది.
జూలై 7, 2022 నాటి పత్రికా ప్రకటనలో ఎన్‌ఐఏ ఇలాంటి వైరల్ క్లెయిమ్ గురించి ప్రస్తావించింది.
"ఎన్‌ఐఏ జారీ చేసినట్లుగా చెప్పబడుతున్న కొన్ని తప్పుదారి పట్టించే సందేశాలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయని గమనించబడింది. ఎన్‌ఐఏ అలాంటి సందేశాన్ని జారీ చేయలేదని అందరికీ ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి సందేశాలు పూర్తిగా నకిలీవి, హానికరమైనవి, ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ట కుట్రలో భాగం."
"గత సంవత్సరం ఎన్‌ఐఏ చేసిన దర్యాప్తులో, ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా యువతను లక్ష్యంగా చేసుకుని, తప్పుడు ప్రచారం ద్వారా వారిపై తీవ్రవాద ప్రభావాన్ని చూపుతున్నట్లు గుర్తించబడింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 2021లో అటువంటి అనుమానాస్పద కార్యకలాపాలను ఎన్‌ఐఏ అధికారులకు ల్యాండ్‌లైన్ నంబర్: 011-24368800 ద్వారా నివేదించవచ్చని విజ్ఞప్తి చేయబడింది."
ఈ పత్రికా ప్రకటనలో ఎన్‌ఐఏ పేర్కొన్న ఈ నంబర్ వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఉంది. అయితే, NIA అధికారిక వెబ్‌సైట్‌లోని 'కాంటాక్ట్ అస్' విభాగంలో మాకు ఆ నంబర్ కనిపించలేదు.
"ఇటువంటి నకిలీ, తప్పుడు సందేశాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే, ఉగ్రవాద కార్యకలాపాలు, అంశాల గురించి సమాచారాన్ని పంచుకోవడం ద్వారా మన దేశాన్ని, ప్రజలను ఉగ్రవాదం నుండి రక్షించడంలో ఎన్‌ఐఏతో చేతులు కలపడానికి స్వాగతం పలుకుతున్నాం" అని ఎన్‌ఐఏ పేర్కొంది.
కాబట్టి, ఉగ్రవాద కార్యకలాపాలను నివేదించడానికి ఎన్‌ఐఏ ప్రత్యేకంగా ఒక ల్యాండ్‌లైన్ నంబర్‌ను జారీ చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. 'లవ్ జిహాద్', 'మజార్ నిర్మాణం' లేదా 'సర్ తన్ సే జుడా' మతపరమైన వ్యాఖ్యలను నివేదించడానికి ఈ నంబర్‌ను ఇవ్వలేదు. వైరల్ క్లెయిమ్ తప్పు అని సౌత్ చెక్ తేల్చింది.