Telugu

Fact Check: మంచులో ధ్యానం చేస్తున్న నాగ సాధువులు? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి...

నాగ సాధువులు మంచులో ధ్యానం చేస్తున్న దృశ్యాన్ని చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో ఒక వీడియో వైరల్ అవుతోంది.

Southcheck Network

Hyderabad: తీవ్రమైన చలిలో, మంచులో నాగ సాధువులు ధ్యానం చేయడాన్ని చూపిస్తోంది అనే క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై ఇలా రాసి ఉంది, "హిందువులు విదేశీ సంప్రదాయ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో-40 డిగ్రీల తీవ్రమైన చలిలో కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతూ శివుడి ధ్యానంలో నాగ సాధువులు -హర హర మహాదేవ్".

ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసారు. (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్ చేస్తున్న వీడియోను ఇక్కడ చూడండి. (ఆర్కైవ్)

ఫాక్ట్ చెక్

వైరల్ వాదనలు అబద్ధమని సౌత్ చెక్ కనుగొంది. వీడియో కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడింది.

వీడియోను నిశితంగా విశ్లేషించి, వీడియోలోని సన్యాసి గడ్డం జుట్టు దాని చుట్టూ ఉన్న మంచుతో కలిసిపోతున్నట్లు కనిపిస్తోందని గుర్తించాం. వీడియోలోని ఇతర సన్యాసుల ఛాయాచిత్రాలు కూడా నునుపుగా ఉన్నాయి, ఎలాంటి వివరాలు కనిపించడం లేదు. వీడియోలోని త్రిశూలంలో కూడా సరిగ్గా లేదు. వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఉత్పత్తి చేయబడిందని ఇవి సూచిస్తున్నాయి.

దీనిని నిర్ధారించడానికి ఏఐ డిటెక్టర్, హైవ్ మోడరేషన్‌ను ఉపయోగించాం. వీడియో 99.8 శాతం ఏఐచే ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని ధృవీకరించబడింది.

కాబట్టి, వైరల్ వాదనలు అవాస్తవమని స్పష్టంగా తెలుస్తుంది. మంచులో ధ్యానం చేస్తున్న సన్యాసుల వీడియో ఏఐ ద్వారా ఉత్పత్తి చేయబడింది.

Fact Check: Massive protest with saffron flags to save Aravalli? Viral clip is AI-generated

Fact Check: തിരുവനന്തപുരത്ത് 50 കോടിയുടെ ഫയല്‍ ഒപ്പുവെച്ച് വി.വി. രാജേഷ്? പ്രചാരണത്തിന്റെ സത്യമറിയാം

Fact Check: கருணாநிதியை குறிப்பிட்டு உதயநிதி ஸ்டாலின் "Rowdy Time" எனப் பதிவிட்டாரா?

Fact Check: ಚಿಕ್ಕಮಗಳೂರಿನ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಮಹಿಳೆಗೆ ದೆವ್ವ ಹಿಡಿದಿದ್ದು ನಿಜವೇ?, ವೈರಲ್ ವೀಡಿಯೊದ ಸತ್ಯಾಂಶ ಇಲ್ಲಿದೆ

Fact Check: Christian lynched in Bangladesh during Dec 25 festivities? No, here are the facts