
Hyderabad: ద్విచక్ర వాహనం మీద ‘అగ్రవర్ణల దారిలో వెళ్లినందుకు’ ఒక జంటపై దాడి చేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ దాడిలో వెనుక సీట్లో కూర్చున్న మహిళను కొడుతూ, ఆమె బట్టలు చింపివేస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిపై దూషణలు చివరకు, ఆ దంపతులు బైక్‌ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు.
ఈ వీడియోలో, బైక్ పై వెళ్తున్న ఒక పురుషుడు, స్త్రీని కొంతమంది వేధించి, వీడియో తీస్తున్నట్లు మనం చూడవచ్చు. ఆ వ్యక్తులు వెనుక సీటుపై కూర్చున్న మహిళను వివస్త్రను చేయడానికి ప్రయత్నించడం, ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను లైంగికంగా వేధించడం చూడవచ్చు. కర్ర పట్టుకున్న మరొక వ్యక్తి ఆమెపై దాడి చేసాడు. ఆ జంట బైక్ స్టార్ట్ చేసి తప్పించుకోగా, వారిని దుర్భాషలాడడం కూడా వినిపిస్తోంది.
ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో “ఉత్తర ప్రదేశ్ ... ఒక దళిత జంట ఒక అగ్రవర్ణల దారి గుండా పోతున్నా వాళ్ళని రోడ్డు మీద అడ్డగించి బైక్ ఆపి ఆ మహిళ చీరని బ్లౌజ్ చింపేసిన హింసించిన అగ్ర వర్ణాలు” అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడింది. (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ ఘటన 2021లో బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా దరియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌లో దళిత జంటపై ద్వేషపూరిత దాడిగా చూపుతున్న వార్తలు లేవు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా హిందుస్తాన్ పత్రికలో ప్రచురితమైన ఒక వార్త కథనం దొరికింది. ఇది 2021 అక్టోబర్ 6న ప్రచురించబడింది. వారిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవ్‌భారత్ టైమ్స్ కూడా అదే రోజున ఇదే ఘటనపై నివేదిక ఇచ్చింది. ఘటన సమయంలో బాధితురాలు మిస్సింగ్‌గా ఉందని పోలీసుల పేర్కొన్నారు.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి Hindusthan కథనాన్ని కనుగొన్నాం. ఈ కథనం 'ఛప్రా: మహిళ అరుస్తూనే ఉంది, దుండగులు ఆమె చీరను లాగుతూనే ఉన్నారు, వీడియో వైరల్ కావడంతో నలుగురిని అరెస్టు చేశారు' అనే శీర్షికతో అక్టోబర్ 6, 2021న ప్రచురించబడింది. (హిందీ నుండి అనువదించబడింది)
ఈ కథనం ప్రకారం, ఈ ఘటన బీహార్‌లోని సరన్ జిల్లాలోని దరియాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. వీడియో వైరల్ అయిన తర్వాత, పోలీసులు ఆరుగురిని గుర్తించి, వారిలో నలుగురిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై Navbharat Times కథనం 'ఛప్రా వైరల్ వీడియో: చప్రా వైరల్ వీడియోలో కనిపించిన దుండగులను పట్టుకున్నరు బీహార్‌లో 'రాబందు సంస్కృతి' ఎప్పటి వరకు కొనసాగుతుంది?' అనే శీర్షికతో ప్రచురించబడింది. (హిందీ నుండి అనువదించబడింది)
లక్ష్మణ్‌చక్‌లోని చన్వర్ ప్రాంతంలో సెప్టెంబర్ 27, 2021న ఈ ఘటన చోటుచేసుకుంది అని కథనం పేర్కొంది. బాధితులను పోలీసులు కనుగొనలేకపోయారు అని రాశారు.
Saran District Administration చేసిన X పోస్ట్ Hindusthan కథనంలో లింక్ చేయబడింది. ఈ సంఘటనకు సంబంధించి సరన్ పోలీసులు చేసిన పత్రికా ప్రకటనను పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో నిందితుల వివరాలు, సంఘటన జరిగిన ప్రదేశం, సమయం, పోలీసులు గుర్తించిన వివరాలను పొందుపరిచారు.
ఈ దాడిని దళిత జంటపై జరిగిన ద్వేషపూరిత నేరం అని ఎక్కడా ప్రస్తావించలేదు. దళిత జంటపై అగ్ర కులస్థులు దాడి చేసినట్లు పేర్కొన్న వార్తా నివేదికలు లేదా విశ్వసనీయ సోషల్ మీడియా పోస్ట్‌లు మాకు కనిపించలేదు.
అయితే, దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని గుర్తించలేకపోయాం.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో కాకుండా సెప్టెంబర్ 27, 2021న బీహార్‌లోని సరన్ జిల్లాలో జరిగింది. దళితులపై ద్వేషపూరిత దాడిగా ఈ ఘటనను చూపుతున్న వార్తలు లేవు. కాబట్టి వైరల్ వీడియో చేస్తున్న క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించాం