Fact Check: రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను వ్యతిరేకిస్తున్న మహిళ? లేదు, ఇది పాత వీడియో

ఒక మహిళ మాట్లాడుతూ "రాహుల్ గాంధీ బీహార్ నుండి పాదయాత్ర చేస్తున్నారు, తర్వాత మణిపూర్ వెళ్తానన్నారు, కానీ దమ్ముంటే పశ్చిమ బెంగాల్ వెళ్ళాలి," అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fact Check: రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను వ్యతిరేకిస్తున్న మహిళ? లేదు, ఇది పాత వీడియో
Published on
2 min read

Hyderabad: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చేస్తున్న ఓటర్ అధికార యాత్రను వ్యతిరేకిస్తున్న మహిళను చూపిస్తున్న వీడియో అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో ఒక మహిళ మాట్లాడుతూ,  రాహుల్ గాంధీని 'పండిట్ పప్పు దాస్ ఖాన్ గాంధీ' అని పిలిచారు. రాహుల్ గాంధీ బీహార్ నుండి పాదయాత్ర చేస్తున్నారని, తర్వాత మణిపూర్ వెళ్తానన్నారని కానీ దమ్ముంటే పశ్చిమ బెంగాల్ వెళ్లాలని అన్నారు. హిందువులు, దళితులపై బెంగాల్లో అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అక్కడ పాదయాత్ర చేయాలని అన్నట్లు చూడవచ్చు. 

ఈ వీడియోపై, "రాహుల్ గాంధీకి మహిళ బహిరంగ సవాల్!" అని హిందీలో రాసి ఉంది. 

ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాశారు, "ఓట్ చోర్ పేరుతో బీహార్లో మన పప్పు ఖాన్ చేస్తున్న పాదయాత్రను తిప్పి కొడుతున్న బిహారీ యువత దేశ సమస్యలను చెబుతూ దరిద్స మహిళలపై హిందూ మహిళలపై హిందువులపై దారుణ కృత్యాలు జరుగుతున్న బెంగాల్ నుంచి వాటిని ఖండించి పాదయాత్ర చేసే దమ్ముందా పప్పు ఖాన్." (ఆర్కైవ్)

Fact Check 

సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ వీడియో పాతది, ఓటర్ అధికార యాత్రకు సంబంధించినది కాదు. 

రాహుల్ గాంధీ ఆగస్టు 17న బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని ససారాం నుండి 'ఓటరు అధికార్ యాత్ర'ను ప్రారంభించారు. రాష్ట్ర ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) ద్వారా ప్రజల ఓటింగ్ హక్కులపై జరిగిన దాడిని హైలైట్ చేయడం ఈ యాత్ర లక్ష్యం.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించాం. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు జూన్ 28న చేయబడిగా తేలింది. 

అయితే, ఈ వీడియో రాహుల్ గాంధీ బీహార్లో ప్రారంభించిన ఓటర్ అధికార యాత్ర కంటే ముందు నుండే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ వీడియోపై 'NewsTankOfficial' అనే లోగో ఉంది. దీని ఆధారంగా, అదే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి కనుగొన్నాం. 

ఈ యూట్యూబ్ ఛానెల్లో షార్ట్స్ రూపంలో వైరల్ వీడియోని షేర్ చేశారు. 'రాహుల్ గాంధీ వైటీ షార్ట్స్ పై యువతులు #రీల్స్ #షార్ట్స్ #షార్ట్స్ ఫీడ్ #శర్మిష్ట' అనే శీర్షికతో ఈ వీడియోని షేర్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోని పోస్ట్ చేసింది జూన్ 3న. 

జూన్ 3న అదే ఛానెల్ ఈ మహిళల కనిపిస్తున్న ఏడు వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఆరు వీడియోలలో ఆమె శర్మిష్ట అరెస్టు గురించి భావోద్వేగంగా మాట్లాడడం చూడవచ్చు. వైరల్ వీడియోని అప్‌లోడ్ చేసిన పోస్ట్ ముందు, దాని తర్వాత ఉన్న వీడియోలు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

ఈ వీడియోల నుండి ఓటరు అధికార్ యాత్ర ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే ఆ మహిళ రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి మాట్లాడిందని కనుగొన్నాం. 

కాబట్టి వైరల్ వ్యాఖ్యలు ఓటరు అధికార్ యాత్రకు సంబంధించినవి కాదని సౌత్ చెక్ తేల్చింది. వీడియో పాతది.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in