Telugu

ఫాక్ట్ చెక్: కేటీఆర్ ఫోటో మార్ఫింగ్ చేసినందుకు కాదు.. భువ‌న‌గిరి ఎంపీ కిర‌ణ్ కుమార్ రెడ్డిని పోలీసులు కొట్టింది.. అస‌లు నిజం ఇది

చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన 2022 వీడియో తప్పుడు వాదనతో ప్రచారం చేయబడుతోంది.

Ramesh M

హైదరాబాద్: పోలీసుల బృందం ఓ వ్యక్తిని కర్రలతో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. కొందరు వీడియో షేర్ చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఫోటోను మార్ఫింగ్ చేసినందుకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి తగిన శిక్ష అని పేర్కొన్నారు. (Archive)

మరో X యూజర్, “చామల కిరణ్ కుమార్ రెడ్డి ని దొంగతనము కేసు లో పిచ్చి పిచ్చి గా కొడుతున్న పోలీసులు…” అని పోస్ట్ చేశాడు.(Archive)

Fact Check

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని సౌత్ చెక్ కనుగొంది. నిజానికి ఈ వీడియో 2022 నాటిది.

వీడియో యొక్క ఒక కీఫ్రేమ్ ను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, జూన్ 16, 2022న ABPLive ద్వారా ప్రచురించబడిన ఫోటో కథనానికి దారితీసింది.

వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్ పోలిక ఇక్కడ ఉంది.

ఈ నివేదిక ప్రకారం, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడాన్ని నిరసిస్తూ అప్పటి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) నిరసన తెలిపింది.

ఈ ఫోటో(వీడియోని పోలియున్న ఫోటో) హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలోనిది అని కూడా ABP లైవ్ తన ఫోటో స్టోరీలో పేర్కొంది. 

అక్కడ నిరసనకారులను చెదరగొట్టే పోలీసుల చర్యలో అప్పటి టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గాయపడ్డారు.

కిరణ్ కుమార్ రెడ్డిపై పోలీసుల దాడినీ ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 16, 2022న, "TPCC అధికార ప్రతినిధి @kiran_chamalaపై పోలీసు సిబ్బంది చేసిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..." అని ట్వీట్ చేశారు.(Archive)

అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను కూడా రేవంత్ రెడ్డి పంచుకున్నారు.(Archive)

ఈ ఘటన జరిగిన సుమారు రెండేళ్ల తర్వాత 2024లో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ అయ్యారు. 

కాబట్టి భువనగిరి కాంగ్రెస్ ఎంపీపై పోలీసులు దాడి చేసిన వీడియోకు కేటీఆర్ ఫోటో మార్ఫింగ్ లేదా దొంగతనం కేసు కు ఎలాంటి సంబంధం లేదు. 

Fact Check: Pro-Palestine march in Kerala? No, video shows protest against toll booth

Fact Check: ഓണം ബംപറടിച്ച സ്ത്രീയുടെ ചിത്രം? സത്യമറിയാം

Fact Check: கரூர் கூட்ட நெரிசலில் பாதிக்கப்பட்டவர்களை பனையூருக்கு அழைத்தாரா விஜய்?

Fact Check: Christian church vandalised in India? No, video is from Pakistan

Fact Check: ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1 ಸಿನಿಮಾ ನೋಡಿ ರಶ್ಮಿಕಾ ರಿಯಾಕ್ಷನ್ ಎಂದು 2022ರ ವೀಡಿಯೊ ವೈರಲ್