Telugu

Fact Check : జగన్ మోహన్ రెడ్డి లండన్‌ పర్యటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటూ వచ్చిన వార్త నిజం కాదు

ravi chandra badugu

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు ఏపీ సీఎం జగన్ విదేశాలకు సెలవులకు వెళ్లారు.

ఎన్నికల పోలింగ్ ముందు తమ పార్టీకి మద్దతుగా జరిగిన కొన్ని వారాల కఠినమైన ప్రచారం తర్వాత, జగన్ మోహన్ రెడ్డి తన భార్య వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష మరియు వర్షతో కలిసి ప్రత్యేక విమానంలో రెండు వారాల విదేశీ(లండన్‌) పర్యటన వెళ్లారు అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి మరియు మనవడు దేవాంశ్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ(లండన్‌) పర్యటనలో ఉండగా జగన్ కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు , ఆందోళనలో భారతి గారు మరియు కుమార్తెలు మరో 3 నెలల పాటు లండన్ లో వైద్యం తప్పనిసరి అంటున్న డాక్టర్లు , ఓటమి విషయం తెలిస్తే మరింత కుంగిపోయే అవకాశం అంటూ ఒక చిత్రాన్ని చాలా మంది సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ పోస్టుల్లోని ఫోటోలు ఇటీవలివి కావని న్యూస్ మీటర్ గుర్తించింది. 2024 ఏప్రిల్ 13 సాయంత్రం జగన్ పై రాళ్ల దాడి సంబంధించిన విజువల్స్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.

'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో 'మేమంత సిద్ధం' సమావేశం పాల్గొంటున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన రాయి తగిలి గాయపడ్డారు ఆ ఘటనలో బస్సు పై ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పక్కనే నిలబడి ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని రాయి తగిలింది. వెంటనే ముఖ్యమంత్రికి డాక్టర్ బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు .గాయపడినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి వైద్యసేవలందించిన అనంతరం బస్సు యాత్రను కొనసాగించారు.

అదనంగా, సంఘటన జరిగిన రోజు తర్వాత రాళ్ల దాడి ఘటనలో  గాయపడిన జగన్ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఎడమ కనుబొమ్మ పైన నుదిటి పై ఉన్న గాయాన్ని కుట్టడానికి ముందు వైద్యులు లోకల్ అనస్థీషియా ఇచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు 

మేము వైరల్ అవుతున్న  ఫోటోలును మరింత శోధిస్తున్నప్పుడు, సాక్షి యూట్యూబ్ ఛానల్ లో  రాళ్ల దాడి ఘటన సమడిచిన ఒక వీడియో లో ఆ ఫోటో థంబ్నెయిల్గా కనిపించింది మరియు రాళ్ల దాడి సంఘటన నివేదించేటప్పుడు అదే ఫోటోను ఇతర మీడియా థంబ్‌నెయిల్ లేదా ఫోటోగా ఉపయోగించారు.

అయితే,రాళ్ల దాడి ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను  లండన్‌ పర్యటనలో హాస్పిటల్లో చికిత్స చేస్తున్న ఫోటో అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు అని మేము కనుగొన్నాము.

కాబట్టి, వైరల్ అవుతున్న ఈ చిత్రాలు రాళ్ల దాడి ఘటనకు  సమాదమేచినవి అని మేము నిర్ధారించాము మరియు వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.

Fact Check: Old video of Sunita Williams giving tour of ISS resurfaces with false claims

Fact Check: Video of Nashik cop prohibiting bhajans near mosques during Azaan shared as recent

Fact Check: ഫ്രാന്‍സില്‍ കൊച്ചുകു‍ഞ്ഞിനെ ആക്രമിച്ച് മുസ്ലിം കുടിയേറ്റക്കാരന്‍? വീഡിയോയുടെ വാസ്തവം

Fact Check: சென்னை சாலைகள் வெள்ளநீரில் மூழ்கியதா? உண்மை என்ன?

ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌లోని దుర్గా విగ్రహం ధ్వంసమైన ఘటనను మతపరమైన కోణంతో ప్రచారం చేస్తున్నారు