Telugu

Fact Check: పశ్చిమ బెంగాల్‌లో ఆరో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, ఓ గుంపు దాడి చేసింది బీజేపీ అభ్యర్థిపై, భద్రతా బలగాలపై కాదు

వీడియోలో ఒక గుంపు BJP MP అభ్యర్థి ప్రణత్ తుడుపై రాళ్లు రువ్వడం మరియు అతని కాన్వాయ్‌ను వెంబడించడం చూడవచ్చు.

Dharavath Sridhar Naik

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ ఓటింగ్ మే 25న ఏడు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం [UT]లోని 58 స్థానాల్లో జరిగింది.

ఆరో దశలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో కొన్ని స్థానాలకు పోలింగ్ జరిగింది. అత్యధిక పోలింగ్ శాతం 79.47గా నమోదైన పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆరో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో భద్రతా బలగాలపై దాడి జరిగిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్కైవ్ లింక్ ఇక్కడ .

నిజ నిర్ధారణ:

దావా పాక్షికంగా తప్పు అని మరియు నిజానికి దాడి జరిగింది బీజేపీ ఎంపీ అభ్యర్థిపై, ప్రత్యేకంగా భద్రతా బలగాలపై కాదని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, పశ్చిమ బెంగాల్‌లో ఆరో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ హింసకు సంబంధించి అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము.

ఆరో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని ఝర్గ్రామ్, బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై హింసాత్మక గుంపు శనివారం దాడి చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఒక గుంపు రాళ్లు రువ్వడం,  ప్రణత్ తుడుని మరియు అతని కాన్వాయ్‌ని వెంబడించడం కనిపించింది. దాడి జరగడంతో, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అతన్ని సురక్షితంగా,  ఘటన స్థలం నుండి తరలించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు కూడా ధ్వంసమైందని. TOI వార్తా నివేదిక పేర్కొంది.

"ఝర్గ్రామ్ లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడు ఈరోజు పార్లమెంటరీ నియోజకవర్గంలోని మొంగ్లాపోటాలోని బూత్ నంబర్ 200ని సందర్శించినప్పుడు ఆయనపై దుండగులు దాడి చేశారని," ANI న్యూస్ ద్వారా Xలో  మే 25వ నాటి ఒక పోస్ట్ కనుగొన్నాము.

అందువల్ల మేము ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా ఉందని మరియు వాస్తవానికి ఆ వీడియోలో , బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై గుంపు దాడి చేస్తున్నట్లుగా నిర్ధారించాము.

Fact Check: Pro-Palestine march in Kerala? No, video shows protest against toll booth

Fact Check: ഓണം ബംപറടിച്ച സ്ത്രീയുടെ ചിത്രം? സത്യമറിയാം

Fact Check: கரூர் கூட்ட நெரிசலில் பாதிக்கப்பட்டவர்களை பனையூருக்கு அழைத்தாரா விஜய்?

Fact Check: Christian church vandalised in India? No, video is from Pakistan

Fact Check: ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1 ಸಿನಿಮಾ ನೋಡಿ ರಶ್ಮಿಕಾ ರಿಯಾಕ್ಷನ್ ಎಂದು 2022ರ ವೀಡಿಯೊ ವೈರಲ್