Telugu

ఫ్యాక్ట్ చెక్: భారత పార్లమెంటు ఆవరణలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ పాల్గొన్నారా? నిజం ఇక్కడ తెలుసుకోండి..

ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారనే ఫోటోలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.

Ramesh M

హైదరాబాద్: సెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని,

"పార్లమెంట్ ఆవరణంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు... Narendra Modi జీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్......    మేరీ మేరీ క్రిస్మస్....." అంటూ పలు సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

 మరిన్ని పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

సౌత్ చెక్ ఈ క్లెయిమ్‌ను తప్పుగా నిర్ధారించింది.

దీనికి సంబంధించి, ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా పరిశీలించగా, మాకు అదే రోజు ఈ ఫోటోలను షేర్ చేస్తూ,
"కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యాను. క్రైస్తవ సమాజ ప్రముఖులతో సంభాషించాను"
అని వ్యాఖ్యానించారు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రధాని మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా షేర్ చేయబడ్డాయి.

మరిన్ని వివరాల కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా, 2024 డిసెంబర్ 20న ఇండియా టుడే వెబ్‌సైట్‌లో ప్రచురితమైన “కేంద్ర మంత్రి స్వగృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చిత్రాలను చూడండి” అనే కథనం ఒకటి లభించింది. 

ఈ కథనం ప్రకారం, ఈ ఫోటోలు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి.

పలు వార్తా సంస్థలు ఈ కథనాన్ని రిపోర్ట్ చేశాయి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

భారత పార్లమెంట్ ఆవరణలో క్రిస్మస్ వేడుకలు జరిగాయా? అని తగిన కీవర్డ్స్ ద్వారా వెతికినా, ఇలాంటి వేడుకలకు సంబంధించిన విశ్వసనీయ ఆధారాలు లభించలేదు.

కాబట్టి, ఈ ఫోటోలు 2024 డిసెంబర్ 19న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి. 

Fact Check: Potholes on Kerala road caught on camera? No, viral image is old

Fact Check: ഇത് റഷ്യയിലുണ്ടായ സുനാമി ദൃശ്യങ്ങളോ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: ஏவுகணை ஏவக்கூடிய ட்ரோன் தயாரித்துள்ள இந்தியா? வைரல் காணொலியின் உண்மை பின்னணி

Fact Check: ರಷ್ಯಾದ ಕಮ್ಚಟ್ಕಾದಲ್ಲಿ ಭೂಕಂಪ, ಸುನಾಮಿ ಎಚ್ಚರಿಕೆ ಎಂದು ಹಳೆಯ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: హైదరాబాద్‌లో ఇంట్లోకి చొరబడి పూజారిపై దాడి? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి