Telugu

Fact Check : EVM ట్యాంపరింగ్ వీడియో అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా షేర్ చేస్తున్న పోస్ట్ లో ఎలాంటి వాస్తవం లేదు

వైరల్ అవుతున్న వీడియో ఉత్తరప్రదేశ్‌లో EVM మెషీన్‌లను అవగాహన కార్యక్రమం రూపొందించిన నిర్ణీత గోదాములో ఉన్న CCTV వీడియో అని సౌత్ చెక్ కనుగొంది.

ravi chandra badugu

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి తమ ఓటమిపై రకరకాల వివరణలు ఇస్తూనే ఉన్నారు. ఓడిపోయిన తర్వాత మొదట్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఓట్లను గల్లంతయ్యాయని, కొన్ని రోజుల తర్వాత ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి టీడీపీ గెలిచిందని అనుమానాలు వ్యక్తం చేశారు

ఈ నేపథ్యంలో, 2024 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో TDP-JSP-BJP కూటమి పార్టీ EVM ట్యాంపరింగ్‌ చేసిన వీడియో అంటూ ఒక పోస్ట్ వైరల్‌గా మారింది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు సంబంధించినది అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను గమనించినపుడు ఆ వీడియోలో ఇద్దరు సభ్యులు డబుల్ లాకర్ తలుపు తెరిచి గది లోపలికి వెళ్లి VVPATతో తిరిగి వస్తున్న దృశ్యాని మరియు ఆ వీడియోలో ఉన్న 28.02.2024 తేదీ గమనించాము

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 03న, DM Rampur (జిల్లా మేజిస్ట్రేట్, రాంపూర్, ఉత్తరప్రదేశ్) ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పైన తప్పుడు వ్యాఖ్యలతో పోస్ట్ చేయబడింది, వాటిని ఖండించారు.

2024 లోక్‌సభ ఎన్నికలలో EVM మెషీన్‌ల FLC వినియోగించిన తర్వాత, భారత ఎన్నికల కమిషన్ సూచించిన SOP ప్రకారం ఇతర యంత్రాల నుండి వేరు చేసి శిక్షణ మరియు అవగాహన కోసం రూపొందించిన నిర్ణీత గోదాములో మొత్తం 107 SAT మెషీన్‌లను భద్రంగా ఉంచారు. , ఈ గిడ్డంగి యొక్క కవరేజీ CCTV ద్వారా చేయబడింది. 28 ఫిబ్రవరి 2024 నాటి ఈ గిడ్డంగి భద్రత కోసం అమర్చిన CCTV ఫుటేజీని కట్ చేయడం ద్వారా పోస్ట్ చేసిన వీడియో ప్రసారం చేయబడింది అని పేర్కొంది.

వీడియో లో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు అవగాహన కోసం ఉపయోగించే యంత్రాల కోసం కొత్త బ్యాటరీలను తొలగించడానికి గోదాంలోకి ప్రవేశించి బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 28.02.2024 తేదీ అని పేర్కొంది.

అదనంగా, జూలై 03, 2024న newsindia24x7 ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా सोशल मीडिया पर EVM से छेड़छाड़ वाला वायरल वीडियो भ्रामक; रामपुर के जिलाधिकारी ने किया खंडन అనే టైటిల్ తో వార్తా నివేదిక కనుగొన్నాము, అందులో వీడియోలో చూపిన దృశ్యాలు ఫిబ్రవరి 28, 2024 నాటివని జిల్లా మేజిస్ట్రేట్ Xకి చెప్పారు. అవగాహన కార్యక్రమం కోసం కొత్త బ్యాటరీలను సేకరించేందుకు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు గిడ్డంగిలోకి ప్రవేశించినట్లు వీడియో చూపిస్తుంది. EVM యంత్రాలను సురక్షితంగా ఉంచే గిడ్డంగి, శిక్షణ మరియు అవగాహన కోసం సృష్టించబడిన ప్రత్యేక స్థలం అని వార్తా కథనం వివరాలను తెలియజేసింది

అదనంగా, భారత ఎన్నికల కమిషన్ ప్రచురించిన "Manual on Electronic Voting Machine Edition 8 August 2023" ప్రకారం, అవగాహన మరియు శిక్షణ కోసం విడిగా ఉంచబడిన EVM మెషీన్‌లను ప్రత్యేక గోదాములో భద్రంగా ఉంచుతారు, ఇక్కడ వాటిని రక్షించే బాధ్యత అధీకృత అధికారులపై ఉంటుంది. . గిడ్డంగిలోని యంత్రాల ప్రతి ప్రవేశం మరియు నిష్క్రమణ వివరాలు లాగ్-బుక్‌లో నమోదు చేయబడతాయి మరియు ఈ ప్రక్రియ అంతా CCTV పర్యవేక్షణలో జరుగుతుంది.

అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు అని మేము నిర్ధారించాము.

Fact Check: Massive protest in Iran under lights from phones? No, video is AI-generated

Fact Check: നിക്കോളസ് മഡുറോയുടെ കസ്റ്റഡിയ്ക്കെതിരെ വെനിസ്വേലയില്‍ നടന്ന പ്രതിഷേധം? ചിത്രത്തിന്റെ സത്യമറിയാം

Fact Check: கேரளப் பேருந்து காணொலி சம்பவத்தில் தொடர்புடைய ஷிம்ஜிதா கைது செய்யப்பட்டதாக வைரலாகும் காணொலி? உண்மை அறிக

Fact Check: ICE protest in US leads to arson, building set on fire? No, here are the facts

Fact Check: ಬಾಂಗ್ಲಾದೇಶದಲ್ಲಿ ಗಾಂಧೀಜಿ ಪ್ರತಿಮೆಯ ಶಿರಚ್ಛೇದ ಮಾಡಿರುವುದು ನಿಜವೇ?, ಇಲ್ಲಿದೆ ಸತ್ಯ