Telugu

Fact Check: TDP-JSPకి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్న వీడియో ఎడిట్ చేయబడింది

TDP-JSP అరాచకాలను అరికట్టాలని బాలకృష్ణ అన్నారని ఆరోపిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేస్తున్నారు

Dharavath Sridhar Naik

నందమూరి బాలకృష్ణ టీడీపీని స్థాపించిన దిగ్గజ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు [ఎన్టీఆర్] కుమారుడు.

బాలకృష్ణ 2014 నుండి హిందూపురం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సభలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరును తమ ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు టీడీపీ 'రా కదలి రా' పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోంది.

కాగా, టీడీపీ-జేఎస్పీ పొత్తుకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీడీపీ నాయకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “తెలుగుదేశం, జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం వైసీపీ ప్రభుత్వం, అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపత అస్త్రమే, వైసీపీ అనేది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది, చీకటి నిండిన మీ బ్రతుకులో అద్భుతమైన వెలుగును ఇస్తుంది అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్న ”

అని అన్నట్లు ఈ వీడియోలో మనం వినచ్చు.

నిజ నిర్ధారణ:

టీడీపీ-జేఎస్పీకి వ్యతిరేకంగా బాలకృష్ణ మాట్లాడినట్లుగా వీడియోను ఎడిట్ చేసి వాయిస్ మార్చినట్లు సౌత్ చెక్‌ గుర్తించింది.

వైరల్ వీడియోను లోతుగా చూసినప్పుడు, లిప్ సింక్ సరిపోలడం లేదని మనం గమనించవచ్చు. బాలకృష్ణ తన స్పీచ్‌లో చెబుతున్నది , అసలు మనం వింటున్నది ఒక్కటే కాదని, పెదవుల కదలికలతో ఇది రుజువైంది .

మేము వైరల్ వీడియో స్క్రీన్‌షాట్‌తో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, Youtubeలో TV5 న్యూస్ మరియు Mango న్యూస్ ప్రసారం చేసిన అసలు వీడియోను కనుగొన్నాము.

ఈ వీడియో మార్చి 4న పెనుగొండలో టీడీపీ-జేఎస్పీ నిర్వహించిన 'రా కదలి రా' బహిరంగ సభకు చెందినది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 12.46 వద్ద మొదలై, టైంస్టాంప్ 14.03 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, బాలకృష్ణ ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ “తెలుగుదేశం, జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనంమే, అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపత అస్త్రమే, చివరగా ఒక మాట చెప్తున్న ఓటర్ అన్న నువ్వు ఇప్పటి దాక నమ్మి ఎక్కింది వైసీపీ అనే కొయ్యా గుర్రాన్ని, నిన్ను మాయ చేసి మభ్యపెట్టి అటు ఇటు ఉపిందే గాన్ని అభివృధి చేయలేదు. తెలుగుదేశం-జనసేన కలయిక వాయు-మనో వేగాలతో పరుగులు తీసే పంచకళ్యాణి గుర్రం, అది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది, చీకటి నిండిన మీ బ్రతుకులో అద్భుతమైన వెలుగును ఇస్తుంది అని తెలియజేసుకుంటూ..నేను సెలవు తీసుకుంటున్న” అని అన్నారు.

ఈ వీడియో వెనుక వాస్తవం ఇదే. బాలకృష్ణ టీడీపీ-జేఎస్పీకి వ్యతిరేకంగా, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మాట్లాడినట్లు చూపించేలా వైరల్ వీడియోను ఎడిట్ చేశారని దీన్ని బట్టి అర్థమైంది.

అందుకే బాలకృష్ణ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని నిర్ధారించాము.

Fact Check: Video of family feud in Rajasthan falsely viral with communal angle

Fact Check: ഫ്രാന്‍സില്‍ കൊച്ചുകു‍ഞ്ഞിനെ ആക്രമിച്ച് മുസ്ലിം കുടിയേറ്റക്കാരന്‍? വീഡിയോയുടെ വാസ്തവം

Fact Check: “தமிழ்தாய் வாழ்த்து தமிழர்களுக்கானது, திராவிடர்களுக்கானது இல்லை” என்று கூறினாரா தமிழ்நாடு ஆளுநர்?

ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌లోని దుర్గా విగ్రహం ధ్వంసమైన ఘటనను మతపరమైన కోణంతో ప్రచారం చేస్తున్నారు

Fact Check: ಲಾರೆನ್ಸ್ ಬಿಷ್ಣೋಯ್ ಗ್ಯಾಂಗ್‌ನಿಂದ ಬೆದರಿಕೆ ಬಂದ ನಂತರ ಮುನಾವರ್ ಫಾರುಕಿ ಕ್ಷಮೆಯಾಚಿಸಿದ್ದು ನಿಜವೇ?