Telugu

FactCheck : 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించిందా? కాదు, నిజం తెలుసుకోండి

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించిందన్న క్లెయిమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sherly

Hyderabad : 75 ఏళ్లు పైబడిన వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ ఓ క్లెయిమ్ వైరల్ అవుతోంది.

ఫేస్‌బుక్ పోస్టులో ఈ క్లెయిమ్స్ చేసిన వ్యక్తి ఈ విధంగా వ్రాసారు, " భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్లు, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు, వారు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. వారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయవలసిన అవసరం లేదు." (ఆర్కైవ్)

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మినహాయింపు ఇవ్వడానికి రూల్ 31, రూల్ 31A, ఫారం 16, 24Qలలో ముఖ్యమైన మార్పులు చేసిందని ఫేస్‌బుక్‌ పోస్ట్ కాప్షన్ లో వ్రాశారు.

"పన్ను మినహాయింపు పొందడానికి వయస్సు 12-BBA దరఖాస్తును బ్యాంకుకు సమర్పించాలి,” అని వ్రాసి, ఈ సమాచారం సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ చెప్పిందన్నారు. ఈ పేస్‌బుక్‌ పోస్ట్ చివరలో ఈ సమాచారం 'సురేష్ పోటే, కార్యదర్శి - మహారాష్ట్ర సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ - ముంబై - నవీ ముంబై డివిజన్' నుండి వచ్చినట్లు సూచించారు.

ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

Fact Check

ఈ ప్ర‌చారం తప్పు అని నిర్ధారించాము.

75 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆదాయ పన్ను మినహాయింపు కలిపిస్తున్నట్లు చూపిస్తున్న సమాచారాన్ని సమర్ధించే విశ్వసనీయమైన ఏ వార్తలు దొరకలేదు.

కీవర్డ్ సెర్చ్ ద్వారా PIBFactCheck నవంబర్ 28న షేర్ చేసిన పోస్ట్ కనుగొన్నాం. ఈ పోస్ట్ క్యాప్షన్లో, "భారతదేశం స్వాతంత్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో ఒక సందేశం వ్యాపిస్తోంది... ఈ సమాచారం అవాస్తవం," అని వ్రాశారు. (ఆర్కైవ్)

“ఆదాయ పన్ను చట్టంలో సవరణలు కోరుతూ అనేక ప్రతిపాదనలు, బడ్జెట్ కసరత్తులో భాగంగా ప్రతి సంవత్సరం స్వీకరిస్తారు. అయితే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో సీనియర్‌ సిటిజన్లకు సంబంధించిన మినహాయింపుల వంటి ప్రతిపాదనలేవి పరిశీలనలో లేవని ఇటీవల పేర్కొన్నారు,” అని ఈ కథనంలో స్పష్టం చేసారు.

Tv 9 Telugu డిసెంబర్ 3న ప్రచురించిన "Income Tax Relief: సీనియర్‌ సిటిజన్లకు కేంద్రం షాక్‌.. ఆ ప్రతిపాదన లేదని స్పష్టీకరణ," అనే కథనం కనుగొన్నాం. ఈ కథనం ప్రకారం, "సీనియర్ సిటిజన్లకు ఆదాయ పన్ను రాయితీ కల్పించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది."

ఈ కథనాల ఆధారంగా, క్లెయిమ్‌లు తప్పు అని నిర్ధారించాము.

Fact Check: Israeli building destroyed by Iranian drone? No, video is from Gaza

Fact Check: ಕಾರವಾರದಲ್ಲಿ ಬೀದಿ ದನಗಳಿಂದ ವ್ಯಕ್ತಿಯೋರ್ವನ ಮೇಲೆ ದಾಳಿ ಎಂದು ಮಹಾರಾಷ್ಟ್ರದ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: தாயின் கண் முன்னே மகனை தாக்கிய காவல்துறையினர்? இச்சம்பவம் திமுக ஆட்சியில் நடைபெற்றதா

Fact Check : 'ట్రంప్‌ను తన్నండి, ఇరాన్ చమురు కొనండి' ఒవైసీ వ్యాఖ్యలపై మోడీ, అమిత్ షా రియాక్షన్? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

Fact Check: സര്‍ക്കാര്‍ സ്കൂളില്‍ ഹജ്ജ് കര്‍മങ്ങള്‍ പരിശീലിപ്പിച്ചോ? വീഡിയോയുടെ വാസ്തവം