Telugu

Fact Check: కేంద్ర బలగాలు ప్రజలను ఈడ్చుకెళ్తున్న వీడియో బెంగాల్‌దా? కాదు, నిజం ఇదే

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా దళాలు ప్రజలను అదుపులోకి తీసుకెళ్తున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Southcheck Network

హైదరాబాద్: కొంతమంది వ్యక్తులను యూనిఫాం ధరించిన సిబ్బంది అదుపులోకి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఘటనగా పంచుకుంటున్నారు.

వైరల్ పోస్టుల ప్రకారం, మాల్దా ప్రాంతంలో ఓటర్ జాబితా పరిశీలనలో పాల్గొంటున్న అధికారులపై దాడి చేసిన వారిని కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకెళ్తున్నట్లు పేర్కొంటున్నారు.

ఒక ఫేస్‌బుక్ యూజర్ వీడియోను షేర్ చేస్తూ, “బెంగాల్లోని మాల్దాలో.. ఓటర్ జాబితా ప్రక్షాళనా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోన్న సుప్రీంకోర్ట్ నియమించిన న్యాయాధికారులపై దాడి చేసిన వారిని ఈడ్చుకెళ్తున్న కేంద్ర బలగాలు” అని రాశారు.(Archive)

Fact Check

సౌత్ చెక్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్‌కు సంబంధించినది కాదు. ఇది బంగ్లాదేశ్‌కు చెందినది.

బంగ్లాదేశ్‌కు చెందిన వీడియో

ఆ దృశ్యాలను నిశితంగా పరిశీలించినప్పుడు, బెంగాలీ భాషలో "మాణిక్ నగర్ మోడల్ హై స్కూల్" మరియు "ముగ్దా థానా స్వచ్ఛంద సేవక దళ్" అని రాసి ఉన్న రెండు బోర్డులు కనిపిస్తాయి. బెంగాలీలో "ముగ్దా థానా" అని గూగుల్‌లో వెతికితే, ఆ ప్రదేశం బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

పైన పేర్కొన్న వివరాల ఆధారంగా, మేము యూట్యూబ్ లో కీలకపదాల ద్వారా వెతకగా, ఒక స్థానిక బంగ్లాదేశీ “Pro Media” ఛానెల్ ఫిబ్రవరి 12, 2026న ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించాము. ఢాకా-9 నియోజకవర్గంలోని మానిక్ నగర్ హైస్కూల్ వద్ద ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తోందని దాని శీర్షిక పేర్కొంది.

ఈ సమాచారంతో గూగుల్ మ్యాప్స్‌లో మణిక్ నగర్ హైస్కూల్ పరిసరాలను పరిశీలించాం. వైరల్ వీడియోలో కనిపించే గేటు, గూగుల్ స్ట్రీట్ వ్యూలో కనిపించే గేటుతో సరిపోలింది.

అలాగే వీడియోలో కనిపించిన బోర్డుపై ఉన్న అక్షరాలను అనువదించగా, అది మణిక్ నగర్ హైస్కూల్‌కు సంబంధించినదని నిర్ధారించాం.

ఈ ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ నేపథ్యంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు తెలుస్తోంది.

వైరల్ వీడియోను వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో అనుసంధానం చేస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు.

Fact Check: Video shows Ukraine’s recent strike on Russia’s Kuibyshev oil refinery? No, here are the facts

Fact Check: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയുടെ 76-ാം ജന്മദിനത്തില്‍ ബുര്‍ജ് ഖലീഫയില്‍ ആശംസ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: இரு கைகளும் இல்லாத பெண் ஜிம்னாஸ்டிக்ஸ் செய்யும் வைரல் காணொலி உண்மையா?

Fact Check: ದೆಹಲಿಯಲ್ಲಿ ಮಳೆಯ ನಡುವೆಯೂ ಮುಖ್ಯ ಚುನಾವಣಾ ಆಯುಕ್ತರ ವಿರುದ್ಧ ಪ್ರತಿಭಟನೆ? ಇಲ್ಲ, ಇದು ಹಳೆಯ ವಿಡಿಯೊ

Fact Check: ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనా? కాదు, పాత వీడియో వైరల్