Telugu

Fact Check: సీజేపీ కార్యకర్తలను ఉరితీయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారా? కాదు, వైరల్ వీడియో డీప్‌ఫేక్

సీజేపీ (Cockroach Janata Party) నిరసనకారులను ఉరితీయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినట్లు వైరల్ అవుతున్న వీడియో డీప్‌ఫేక్.

Southcheck Network

Hyderabad: ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు నిరసనగా దేశవ్యాప్తంగా సాగిన సీజేపీ (Cockroach Janata Party) ఉద్యమం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో, సీజేపీ నిరసనకారులను ఉద్దేశించి ఇద్దరు, ముగ్గురిని బహిరంగంగా ఉరితీయాలని, అప్పుడు మిగతావారంతా భయపడతారని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినట్లు వినిపిస్తోంది.
ఒక ఎక్స్‌ (X) యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "మొన్న ఏలూరులో దళిత క్రైస్తవ సభలో శ్రీ రామునిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు దూషణలు చేసిన సురేష్ జాతవ్ అనే వాడిని ఏలూరు పోలీస్ స్టేషన్లో పెట్టి సకల మర్యాదలు చేస్తున్న పోలీసులు." అని క్యాప్షన్ ఇచ్చాడు. (ఆర్కైవ్)

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో వైరల్ ప్రచారం తప్పు అని తేలింది. వైరల్ వీడియో డీప్‌ఫేక్. పీయూష్ గోయల్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అసలు వీడియోలో ఏముంది?

వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే దృశ్యాలు వార్తా సంస్థ PTI విడుదల చేసిన వీడియోలో కనిపించాయి.

ఆ వీడియోలో పీయూష్ గోయల్ ప్రశ్నపత్రాల లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడారు. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలాగే ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చర్చించాలని, ప్రతిపక్షాలు పారిపోకుండా చర్చలో పాల్గొనాలని కోరారు.

ANI మరియు DD News ప్రచురించిన వీడియోల్లో కూడా ఇదే ప్రసంగం కనిపించింది. ఈ వీడియోల్లో ఎక్కడా పీయూష్ గోయల్ సీజేపీ పేరు ప్రస్తావించలేదు. నిరసనకారులను ఉరితీయాలని కూడా ఆయన చెప్పలేదు.

AI డిటెక్షన్ టూల్స్ ఏమి చెప్పాయి?

వైరల్ వీడియో ఆడియోను Hive Moderation AI డిటెక్షన్ టూల్ కూడా వీడియోలోని ఆడియో AIతో రూపొందించబడిన అవకాశం 72.4 శాతం ఉందని తెలిపింది.

పీయూష్ గోయల్, PIB వివరణ

ఈ వైరల్ వీడియోపై పీయూష్ గోయల్ తన అధికారిక X ఖాతాలో స్పందించారు. AI సాయంతో తన ప్రసంగాన్ని దురుద్దేశపూర్వకంగా మార్చి డీప్‌ఫేక్ వీడియో రూపొందించారని, దీనిపై FIR కూడా నమోదు చేసినట్లు తెలిపారు.

అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఈ వీడియో నకిలీదని, AIతో రూపొందించిన డీప్‌ఫేక్ అని స్పష్టం చేసింది.

వైరల్ వీడియోలో పీయూష్ గోయల్ సీజేపీ నిరసనకారులను ఉరితీయాలని వ్యాఖ్యానించినట్లు చూపించినప్పటికీ, అది డీప్‌ఫేక్ వీడియో. అసలు ప్రసంగంలో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు

Fact Check: Jamui molestation case-Two accused killed in encounter? No, here are the facts

Fact Check: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയുടെ 76-ാം ജന്മദിനത്തില്‍ ബുര്‍ജ് ഖലീഫയില്‍ ആശംസ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: வாரணாசியில் சிறுமிக்கு நேர்ந்த பாலியல் அத்துமீறல் எனப் பரவும் காணொலி? உண்மை என்ன

Fact Check: ನಂದಿ ವಿಗ್ರಹಕ್ಕೆ ಬಾಳೆಹಣ್ಣು ತಿನ್ನಿಸುತ್ತಿರುವ ಕೋತಿ ಎಂದು ಎಐ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: జముయి వేధింపుల కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌లో అరెస్ట్ చేశారా? కాదు, వీడియో ముజఫర్‌నగర్‌కు చెందినది