Telugu

Fact Check: కనీసం 2016 నుండి అందుబాటులో ఉన్న ఫోటోను, 2024 రైతు ఉద్యమంలో పాల్గొన్న నకిలీ సిక్కు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

Dharavath Sridhar Naik

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మళ్లీ ఇటీవలి కాలంలో నిరసనలు చేయడం మనం చూస్తున్నాము. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మరియు ఉత్తరప్రదేశ్‌ నుంచి రైతులు నిరసనల్లో పాల్గొంటున్నారు.

"కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న 2024 రైతు ఉద్యమంలో నకిలీ సిక్కు" అని.

"రైతు ఆందోళన లో పడి సమయం చూసుకోక, నమాజ్ టైమయ్యేసరికి, హడావుడి గా వేషం విప్పేసేందుకు సమయం దొరకక ఉన్న ఫళంగానే నమాజ్ చేయాల్సి వచ్చిన అసలు సిసలు రైతు ఆందోళనకారుడు" అని చెప్తూ, ఒక వ్యక్తి తలపాగా పెట్టుకుని నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు.

ఫేస్బుక్ పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్

దీని వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం రండి.

నిజ నిర్ధారణ:

తప్పుడు సమాచారంతో పాత ఫోటో ప్రచారంలో ఉన్నట్లు సౌత్ చెక్ గుర్తించింది.

మేము ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించగా, అదే ఫోటోని ఒకరు 2016 లోనే ‘సిఖ్ అవేర్నెస్’ అనే వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా, ఆ ఫోటోని ఒకరు ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు ఆ వెబ్సైటులోని ఫోటోలో చూడవొచ్చు.

ఫేస్బుక్ లో కీ-వర్డ్స్ తో వెతకగా, జనవరి 2016 లో చాలా మంది ఆ ఫోటోని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది.

అంతేకాకుండా, భారత ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను సెప్టెంబర్ 2020లో ప్రవేశపెట్టింది, ఇది దేశవ్యాప్తంగా రైతుల విస్తృత నిరసనలకు దారితీసింది.

కానీ, ఒక సిక్కు మసీదును సందర్శించి నమాజ్ చేస్తున్న ఫోటో కనీసం 2016 నుండి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది.

పోస్ట్‌లోని దావా ఇటీవల రైతుల నిరసనలతో మరియు నమాజ్ చేస్తున్న సిక్కు వ్యక్తి ఫోటోను లింక్ చేస్తుంది. ఈ టైమ్‌లైన్ యొక్క స్పష్టతతో, పోస్ట్‌లోని దావా తప్పు మరియు తప్పుదారి పట్టించేది అని మనం సులభంగా నిర్ధారించవచ్చు.

అందుకని "కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న 2024 రైతు ఉద్యమంలో నకిలీ సిక్కు" అనే ఈ దావా తప్పుదోవ పట్టించేది

Fact Check: Man assaulting woman in viral video is not Pakistani immigrant from New York

Fact Check: സീതാറാം യെച്ചൂരിയുടെ മരണവാര്‍ത്ത ദേശാഭിമാനി അവഗണിച്ചോ?

Fact Check: மறைந்த சீதாராம் யெச்சூரியின் உடலுக்கு எய்ம்ஸ் மருத்துவர்கள் வணக்கம் செலுத்தினரா?

ఫ్యాక్ట్ చెక్: ఐకానిక్ ఫోటోను ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీకి సీతారాం ఏచూరి క్షమాపణలు చెబుతున్నట్లుగా తప్పుగా షేర్ చేశారు.

Fact Check: ಅಂಗಡಿಯನ್ನು ಧ್ವಂಸಗೊಳಿಸುತ್ತಿದ್ದವರಿಗೆ ಆರ್ಮಿಯವರು ಗನ್ ಪಾಯಿಂಟ್ ತೋರಿದ ವೀಡಿಯೊ ಭಾರತದ್ದಲ್ಲ