Telugu

Fact Check : తోకలు కత్తిరిస్తా జాగ్రత్త అంటూ 2018లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వీడియోను, ఇటీవలిది అని తప్పుగా షేర్ చేయబడుతోంది

Southcheck Network

ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడుకు మరియు నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరగడం మనం చూడవచ్చు.

"ఎక్కువ తక్కువ చేస్తే బీసీల తోకలు కత్తిరిస్తా జాగ్రత్త అంటూ రాష్ట్రంలోని బీసీలందరికీ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు!" అని పేర్కొంటూ అనేక మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

YSRCP అధికారిక హ్యాండిల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను షేర్ చేసింది.

నిజ నిర్ధారణ :

ఈ వైరల్ వీడియో 2018 కి చెందినది మరియు ఇటీవలిది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.

మా పరిశోధనలో మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, ఈ వైరల్ వీడియోకి సంబంధించిన జూన్ 2018 నాటి న్యూస్ ఛానెల్ రిపోర్టింగ్‌లను మేము కనుగొన్నాము.

2018లో నెలకు కనీసం 15 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు సచివాలయంలోకి చొరబడ్డారు. ప్రభుత్వం వారి చెల్లింపులను పెంచినప్పటికీ, వారి అనుచిత ప్రవర్తనపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారని 20 జూన్ 2018న V6 న్యూస్ నివేదించింది.

"బి కేర్ఫుల్, మర్యాదకి మర్యాద ఇస్తాము, పిచ్చి ఆటలు ఆడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది, ఇది చేపల మార్కెట్ కాదు.." అంటూ చాలా ఘాటుగా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

మేము వైరల్ వీడియోకు సంబంధించి 18 జూన్ 2018 నాటి అదే విషయాన్ని నివేదించిన మరో న్యూస్ రిపోర్టింగ్ వీడియోని కనుగొన్నాము.

అందువల్ల, తోకలు కత్తిరిస్తా జాగ్రత్త అంటూ చంద్రబాబు నాయుడు తీవ్రంగా మాట్లాడిన వీడియో 2018 లోనిదని మరియు ఇటీవలిది అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.

Fact Check: 2022 video of Nitish Kumar meeting Lalu Yadav resurfaces in 2024

Fact Check: തകര്‍ന്ന റോഡുകളില്‍ വേറിട്ട പ്രതിഷേധം - ഈ വീഡിയോ കേരളത്തിലേതോ?

Fact Check: “கோட்” திரைப்படத்தின் திரையிடலின் போது திரையரங்கிற்குள் ரசிகர்கள் பட்டாசு வெடித்தனரா?

నిజమెంత: పాకిస్తాన్ కు చెందిన వీడియోను విజయవాడలో వరదల విజువల్స్‌గా తప్పుడు ప్రచారం చేశారు

Fact Check: ಚೀನಾದಲ್ಲಿ ರೆಸ್ಟೋರೆಂಟ್​ನಲ್ಲಿ ನಮಾಜ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಎಂಬ ವೀಡಿಯೊ ಸುಳ್ಳು