Telugu

Fact Check : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డు పై ధరలు తగ్గింది అంటూ వచ్చిన వార్త నిజం కాదు

ravi chandra badugu

కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు TTD లో దురదృష్టకర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత TTD లో సమూల మార్పులకు ప్రభుత్వం సమయమైంది ఇందులో భాగంగా 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును టీటీడీ ఈవోగా బాధ్యతలును అప్పగించింది

ఈవోగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే తిరుమలలో తనిఖీలు నిర్వహించి, వాస్తవ పరిస్థితులను తెలిసికుతూ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా లడ్డూ ధర ₹50 నుంచి ₹25కి, ప్రత్యేక దర్శనానికి ₹300కి బదులుగా ₹200 తగ్గించింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ కార్డ్ రూపంలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు TTD అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అని సౌత్ చెక్ కనుగొంది

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, జూన్ 22, 2024న ttdevasthanams ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరలో ఎలాంటి మార్పు లేదని తిరుమల శ్రీ వేంకటేశ్వర దేవస్థానం Instagram ఖాతా ద్వారా తెలియజేసింది మరియు సోషల్ మీడియా వేదికలపై వచ్చే తప్పుడు వార్తలను భక్తులు నమ్మవద్దని కోరారు

టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి భక్తులను కోరింది, భక్తులు వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా దర్శన ప్యాకేజీ టిక్కెట్లను పొందవచ్చు తెలియచేసింది

టూరిజం వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు కొందరు బ్రోకర్లు అమాయకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చింది. అమాయక భక్తులను మోసం చేసే బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది మరియు భక్తులు టీటీడీ మరియు టూరిజం అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అదనంగా, 2024 జూన్ 06న, ఈనాడు జనరల్ వార్తలు ద్వారా అది ఫేక్ న్యూస్.. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధర పెంపుపై తితిదే క్లారిటీ అంటూ ఒక రిపోర్ట్ విడుదల చేసింది మరియు జూన్ 22, 2024 Deccan Chronicleలో No change in special entry darshan tickets and laddu rates in Tirumala: TTD clarifies అనే వార్తలు మేము కనుగొన్నాము.

అందువల్ల,తిరుమల స్పెషల్ దర్శనం మరియు లడ్డు పై ధరలు తగ్గింది అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Fact Check: Old video of Union minister Jyotiraditya Scindia criticising Bajrang Dal goes viral

Fact Check: ഈസ് ഓഫ് ഡൂയിങ് ബിസിനസില്‍ കേരളത്തിന് ഒന്നാം റാങ്കെന്ന അവകാശവാദം വ്യാജമോ? വിവരാവകാശ രേഖയുടെ വാസ്തവം

Fact Check: திமுக தலைவர் ஸ்டாலினுக்கு பக்கத்தில் மறைந்த முதல்வர் கருணாநிதிக்கு இருக்கை அமைக்கப்பட்டதன் பின்னணி என்ன?

ఫ్యాక్ట్ చెక్: 2018లో రికార్డు చేసిన వీడియోను లెబనాన్‌లో షియా-సున్నీ అల్లర్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు

Fact Check: ಚಲನ್ ನೀಡಿದ್ದಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಪೊಲೀಸರನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಸುಳ್ಳು ಹೇಳಿಕೆ ವೈರಲ್