Telugu

ఫ్యాక్ట్ చెక్: 2018లో రికార్డు చేసిన వీడియోను లెబనాన్‌లో షియా-సున్నీ అల్లర్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు

Southcheck Network

హైదరాబాద్: సెప్టెంబర్ 27, 2024, శుక్రవారం నాడు లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరణించాడంటూ ధృవీకరించారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు తీవ్రంగా మారిపోతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని సమూహాలు గొడవ పడుతున్నట్లుగా అందులో ఉంది. వైరల్ వీడియోలో మోటార్‌సైకిళ్లు, కార్లలో వచ్చిన వ్యక్తులు వీధిలో ఘర్షణకు దిగుతున్నట్లు చూపిస్తుంది. నస్రల్లా హత్యను నివేదించిన తర్వాత షియా-సున్నీ కమ్యూనిటీల మధ్య అల్లర్లు జరిగాయనే వాదనతో పోస్టులు పెట్టారు.

ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేసి, “లెబనాన్‌లో షియా-సున్నీ అల్లర్లు మొదలయ్యాయి... ఇప్పుడు సున్నీ ముస్లింలు... హిజ్బుల్లాకు మద్దతు ఇచ్చే షియా ముస్లింలు వారిని కొట్టి తరిమివేస్తున్నారు... ఇజ్రాయెల్ దాడుల కారణంగా , చాలా సమీకరణాలు మారుతున్నాయి…” అంటూ పోస్టు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

సౌత్చెక్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వీడియో 2018 నాటిది. ఇజ్రాయెల్-హిజ్బుల్లా వివాదంతో ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మే 8, 2018న ప్రచురించిన అరబిక్ కథనాన్ని కూడా మేము కనుగొన్నాము.

మే 2018 పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత లెబనాన్‌లోని బీరూట్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయని నివేదించింది. హిజ్బుల్లా, అమల్ మద్దతుదారులు రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ సున్నీ, క్రైస్తవులు అధికంగా ఉండే ప్రాంతాలలో సెక్టారియన్ కవాతులను నిర్వహించారని తెలిపింది.

ఈ కారణంగా సమూహాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. వీధుల్లో గొడవలకు దిగారు. గొడవలు తీవ్రతరం కాకుండా భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నాయి.

Yafa News ఈ సంఘటన గురించి మే 8, 2018న నివేదించింది.  2018 పార్లమెంటరీ ఎన్నికల్లో హిజ్బుల్లా, అమల్‌ మద్దతుదారులు ఆధిక్యంలో ఉన్నప్పుడు బీరుట్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. హిజ్బుల్లా, అమల్ మూవ్‌మెంట్ మద్దతుదారుల కాన్వాయ్‌లు అనేక ప్రాంతాలలో తిరిగాయి. మతపరమైన నినాదాలు చేయడంతో నగరంలో అశాంతి నెలకొంది. పలు ప్రాంతాల్లో గొడవలు కూడా జరిగాయి.

మరో మీడియా సంస్థ, DD-Sunnah కూడా అదే వివరాలతో మే 8, 2018న జరిగిన సంఘటనను నివేదించింది.

అందువల్ల, ఈ వీడియో 2018 నాటిదని మేము ధృవీకరించాం. ఇటీవల నస్రల్లా హత్య తర్వాత షియా-సున్నీ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించింది కాదని మేము నిర్ధారించాము.

Fact Check: Israeli defence minister Yoav Gallant not killed in Iran missile attack

Fact Check: ഈസ് ഓഫ് ഡൂയിങ് ബിസിനസില്‍ കേരളത്തിന് ഒന്നാം റാങ്കെന്ന അവകാശവാദം വ്യാജമോ? വിവരാവകാശ രേഖയുടെ വാസ്തവം

Fact Check: நேரு, தான் சுதந்திர போராட்டத்தில் ஈடுபடவில்லை என்று நேர்காணலில் தெரிவித்தாரா? உண்மை என்ன?

Fact Check: ಚಲನ್ ನೀಡಿದ್ದಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಪೊಲೀಸರನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಸುಳ್ಳು ಹೇಳಿಕೆ ವೈರಲ್

Fact Check: No, viral image does not show vandalism of Maharaja Ranjit Singh statue’s in Punjab