Telugu

Fact Check : ఫోటోషూట్ తర్వాత అంగన్‌వాడీ టీచర్ మధ్యాహ్న భోజనం గుడ్లను వెనక్కి తీసుకుతున వీడియో ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాదు

ఈ ఘటన కర్నాటకలోని కొప్పల్ జిల్లాలోని జరిగింది.

ravi chandra badugu

ఒక మహిళ పిల్లలకు గుడ్లు వడ్డించింది, ఆ తర్వాత విద్యార్థులను ప్రార్థన చేయించి, ఆ ప్రార్థన ఫోటోలు, వీడియోలు తీసుకున్నాక, పిల్లల ప్లేట్ లో నుంచి గుడ్లు బలవంతంగా వెనక్కి తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం పాలనలో ఒక అంగన్‌వాడీ పాఠశాలలో మధ్యన భోజనంలో గుడ్లు పెట్టినట్టు పెట్టి వెనక్కి తీసుకున్న అంగన్వాడీ టీచర్ దీనిబట్టి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటూ అనేక మంది ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ వీడియో కర్ణాటక కు చెందినది మరియు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు అని సౌత్ చెక్ కనుగొంది.

మా పరిశోధనలో మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, ఈ వైరల్ వీడియో సంబంధించి ఆగస్టు 10, 2024 న IndiaToday ట్విట్టర్ ఖాతాలో కర్నాటకలోని కొప్పల్ జిల్లా లోని ఇద్దరు ఆంగన్‌వాడీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ చర్య తీసుకోవడానికి కారణం వారిపై వచ్చిన వీడియో వైరల్ కావడం. ఆ వీడియోలో వారు పిల్లలకు వడ్డించిన గుడ్లను తిరిగి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి అంటూ వైరల్ వీడియో పోస్ట్ చేయబడింది.

అంతేకాకుండా, వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, 2024 ఆగస్టు 10 న English Jagran ఆన్‌లైన్ వార్తా ద్వారా Caught On Camera: Karnataka Anganwadi Workers Seen Taking Eggs Back From Children's Plate After Photo Ops అనే టైటిల్ తో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో, మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలకు వడ్డించిన గుడ్లను తిరిగి తీసుకున్నందుకు ఇద్దరు ఆంగన్‌వాడీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, ఈ ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అనైతిక చర్యలను తిరగదొడమని అన్ని ఆంగన్‌వాడీ సిబ్బందికి సూచించింది అని మరింత వివరాలు మరియు వైరల్ వీడియోకి సంబంధించిన ఫోటోలుతో ఆ నివేదిక పేర్కొంది.

అదనంగా, 2024 ఆగస్టు 10న DCG Kannada ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా మరో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో ఈ ఘటనకు కారణమైన కొప్పాల గుండూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ వర్కర్‌, హెల్పర్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు అంటూ అంగన్‌వాడీ వర్కర్ మరియు అసిస్టెంట్ సస్పెన్షన్ లేఖతో పాటు వైరల్ వీడియోను ప్రచురించింది.

అందువల్ల, ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Fact Check: Elephant hurls guard who obstructed ritual in Tamil Nadu? No, here’s what happened

Fact Check: ശബരിമല മകരവിളക്ക് തെളിയിക്കുന്ന പഴയകാല ചിത്രമോ ഇത്? സത്യമറിയാം

Fact Check: இந்துக் கடவுளுக்கு தீபாராதனை காட்டினாரா அசாதுதீன் ஓவைசி? உண்மை அறிக

Fact Check: ಮೋದಿ ಸೋಲಿಗೆ ಅಸ್ಸಾಂನಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಬಾಂಗ್ಲಾದೇಶದ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: శ్రీలంక వరదల్లో ఏనుగు కుక్కని కాపాడుతున్న నిజమైన దృశ్యాలా? కాదు, ఇది AI-జనరేటెడ్ వీడియో